Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గింజల్ని రాల్చుకుని
పొట్టు కండ్లలో కొడుతున్నారు
పైరుగాలి తీసుకుని
ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లి
నెత్తురు లాగి
బ్లడ్ బ్యాంకు పేరిట సేవ చేస్తున్నారు
కల్లంలో పొట్టు తప్పితే గింజలేదు
జానెడు పొట్టలో పేగులు తప్పితే బువ్వలేదు
పిడక కొట్టిన కాసు రాలేదు
చేతి పనులకు యంత్రాలు బేడిలేసాయి
నోటి కూటికి తాళాలు పడ్డాయి
నాన్న చాకిరీ గొడ్ల సావిట్లో కామతంకు పోయే
అమ్మ చాకిరీ కల్లంలో కన్నీళ్లు
రోజు గడవటమే కష్టం
బతుకంతా అమావాస్య పూనింది
కీచురాలు ఒకటే అరుపులు
డొంకంతా ఒకటే గబ్బిగీయిం
ఎక్కడో తళ్ళుక్కున మిణుగురు
తీరా చూస్తే
తూర్పున పీడకలు చేస్తూ అమ్మ
చీకటిని చీల్చుకుంటూ నాన్న .
- తంగిరాల సోని, 9676609234