Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గెట్టువెంట పేర్చిన ముళ్లకంప
ముట్టుకుంటే అది గాలికొంప
ఎక్కడున్నా వెంటవస్తది
చిక్కుకుంటే పరేషాన్ అయితది
ముళ్ల పొదల్లో మాదిస్తుది
మలినం ఆగేయశ్రేణిలో ముందడుగు వేస్తది
గాలి పేరట్లలో దిక్కుల వేగం చూపిస్తది
దిక్కుల గగనం ముళ్ల మందలో
ప్రమాదం పొంచి ఉంది
ఎటు పోవాలో తెలియక
బిక్కుబిక్కున నడిసంద్రంలో ఒంటరికి
ఇసుక తేన్నెలా పై వేడితాకిస్తది
మాసబారిన మబ్బుల్లో వేకువరాత్రుల్లో
దారివెంట గుబురు గుబురు వేలాడుతది
గభిరంగా కనిపిస్తది
ఒకనొక రోజులో ఎర్రగా మెరుస్తది
అది ఏంటో ఒక హెచ్చరిక చేస్తది
బ్రిడ్జి పై వెళ్ళాలంటే
అండర్ గ్రౌండ్లో వెళ్ళాలంటే
నడిచేవాళ్ళ కు ప్రమాదకారి
ముళ్ల పోతిళ్ళ దారి
కాంక్రిట్ సమాధుల్లో ఉండదు
కప్పిమోసిన అదారి
ఇంట్లో చుస్తే వెంటిలెటర్లో కనిపిస్తది
ఎదో భయం కలిగిస్తది
శవాలు కాకుండా
జాగ్రత్త ఉండలి
శిలలు గా నిలవాలి
అదే ధైర్యం గమ్యం చేరుస్తది
ఇంలాంటి ఎన్ని కంపలు వచ్చినా
వాటిని తప్పికొట్టి ఎదురుకోవాలి
ముళ్లను నరికి ముందుకెళ్లాలి
- బూర్గు గోపికృష్ణ, 7995892410