Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వు సమయాన్ని నిర్దారిస్తావు
అప్పటికే నేను
పీచు, పుల్లలను ఏరుకొని
బృహత్తరమైన నిర్మాణాన్ని
ముగించకుండా ఎదురుచూస్తుంటాను
భూగోళం లాంటి తల పగిలిపోయిందంటావు
మరి నా పీఠిక సంగతేంటి?
నిద్రను మోపులుగా
కన్నుల పొయ్యిలో కాలుస్తావు
ముగింపు లేని మనిషిలా నేను
నీది కాని సమయాన్ని మింగేసి
చీమలు చీమలుగా కట్టుకున్న
నా ఒక్కగానొక్క పుట్టలోకి జొరబడి
వాక్యం తప్పిపోయిందంటావు
అరచేతుల నిండా
అక్షర గింజలను ఏరుకొని
నిశీధి గెట్లపై నడుచుకుంటూ
తప్పిపోయిన వాక్యాన్ని
పునర్నిర్మిస్తాను
- జాని తక్కెడశిల, 7259511956