Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం రక్తహీనతతో బాధపడుతుంది
యువత రాత మార్చడానికి
దాతలు రక్తదానం చేయండి
పేదల ఆహాకారాలు ఆకలి కేకల సావుల
దిక్కులు పిక్కటిల్లే అహాకారాలు ఎంత మొత్తుకున్నా
ఇప్పుడు వీరికి వినిపించవు గాక వినిపించవు
దేశం వినికిడి సమస్యతో బాధపడుతుంది
ఇప్పుడు వినికిడి పరికరం
సరసమైన ధరలకు విఫణిలో అందుబాటులో ఉన్నాయి
నా దేశం ఇప్పుడు
కండ్లుండి చూపు కోల్పోయింది
చెవులు ఉండి వినికిడి శక్తి పోగొట్టుకుంది
నోరు ఉండి కూడా మాట్లాడలేక పోతుంది
కారణం తెలిసి తెలిసీ అనక అడుగలేక పోతుంది
మన దేశం ఎంతో గొప్పది చెప్పి చెప్పి
హిమాలయాల ఎత్తుకు జెండా పాతారు
ప్రపంచం మనల్ని చూసి దెప్పి తిప్పి
వికటట్టాహాసం చేస్తున్నా
మనం మన విగ్రహాలను ఆవిష్కరిస్తూ
పొగడ్తలతో ముంచెత్తుతాము
ఇనుప డేగ ముక్కుతో పొడుచుకు తింటున్నా
మహదానందంతో కర్త కర్మ క్రియల
పేరున పులకరించి పోతున్నది మనమే
మనకేం తక్కువ
అమెరికాలో సిలికాన్ వ్యాలీనీ ఏలుతుంది మనమే
ఇంకేం గల్లా ఎగిరేరు
మన చెమటను అమ్మి
డాలర్ల రూపంలో లాభాలు గడిస్తున్నదీ మనమే
ఇక చాలు దేశం మున్ముందుకు పోతున్నది
ప్రజలను ప్రలోభ పరిస్తున్నది
పింఛన్ల పేరు వంచన చేస్తూ కుర్చీపై కర్చీఫ్ వేస్తున్నాం
మనమే జూమ్ మీటింగ్లో పాల్గొని
విశ్వ గురువు నేనేనని
పంకిల మైన పొంకనాలు పోతున్నది
మనకే హాయ్ హాయ్ మనమే భాయ్
- జూకంటి జగన్నాథం, 9441078095