Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న కవితలు ఈ కాలపు అవసరంలా ఉంది ఏనుగు నరసింహారెడ్డి సరికొత్త ఒరవడి పూల పూల వాన కవిత్వం ఆయన చిన్న కవితల్లో కూడా దాని మూలాలు వెతికి ఆలోచన కలిగించే లాగా రాస్తారు.
'పనిలో భాగంగానేను అప్పుడప్పుడు ఓ రాళ్ళ మీద నడుస్తాను. పంటచేల నడుమ తిరుగుతాను . ప్రజలతో కలిసి పర్యవేక్షిస్తాను. నోరు మెత్తని వాళ్లను కలుస్తాను. పట్టణత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తాను. అలా కొత్త ప్రదేశాల్ని చూసినప్పుడు. కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు. కొత్త అనుభవాలకు గురైనప్పుడు నాలో ఊహల ముత్యాలు రాలుతుంటాయి. అవి రాతల రత్నాలైనాయా' అంటూ కొన్ని వాక్యాలు మన ముందు ఉంచుతారు.
'అంత విశాలమంటారా ఆకాశాన్ని
ఆనందంతో గంతులేయడానికి
అంతరంగమంత పెద్దదేది
నాకింతవరకు కనబడనే లేదు'
అంటూ గొప్ప ఊహను వ్యక్తం చేస్తారు.
'కూలోల్లు కూచున్న
మా అరుగు మేలు
నాలిగిండ్ల ముచ్చట్ల
సారమే తేలు' అని అనడం ఆయన ప్రగతి దృష్టి .
'కొడుకు సమాధి మీద
పండు పెట్టి
తిను కొడుకా అంది
దుఃఖం అవతార మెత్తిన తల్లి'
కొడుకు చనిపోయిన సమాధి దగ్గర తల్లి పడే బాధను తెలిపారు ఈ పాదాల్లో.
'గౌడు చెట్టెక్కి
చుక్కల్ని చూస్తాడు
మోకు విప్పి
అంపశయ్యపై పవళిస్తాడు'అంటాడు
గీత కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి తరతరాలుగా చెట్టెక్కి కల్లుగీసి దప్పికను తీర్చుతున్నారు . తాటి చెట్టెక్కడం ఎంత కష్టమైనది. అది తీగ మీద నడవడం అంత కఠినమైనదంటారు.
'చరిత్రను
తిరగెయ్యండి
ఒకప్పుడు మూసీ నది కూడా
ప్రవహించేది'
కుదుబ్షాహీల కాలం నాటి చిన్న పాదాల్లో మూసీనదిని గుర్తు చేశారు.
పూల పూల వాన కవిత్వ అక్షరాలు ఆయుధం చేసి నాలుగు పాదాల లఘుకావ్యం అందరికీ అర్థమయ్యే విధంగా రాసారు. ఏనుగు నరసింహారెడ్డి కలం నుండి జాలువరిన పూల పూల వాన కవితా హృదయ లేపానం.
- బూర్గు.గోపికృష్ణ, 7995892410