Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యుని తొలికిరణం నేలను చేరక మునుపే
నడుం బిగించి నడివీధిలో నిలిచే శ్రామికులు!
మలినాలను సైతం సుగంధాలుగా అద్దుకుంటూ
నగరాన్ని కంటికి ఇంపుగా మార్చే సేవకులు!
సెలవు దినాలే తెలియని కష్టజీవులు!
ఒక్క పూట ఒళ్ళు బాగోక... పనికి రాకపోతే
చీదరింపులతో చేస్తారు సత్కారాలు!
వారి స్థానంలో నిలబడితే తెలిసేను వాళ్ల కష్టాలు!
సెప్టిక్ ట్యాంక్ నుంచి ఎంగిలాకులు వరకు
పరిశుభ్రం చేస్తూ...
ఆరోగ్యాన్ని ప్రసాదించే అభయ హస్తాలు!
అయినా తగిన ఆదరణ,
గౌరవం దక్కని నిర్భాగ్యులు!
కనీస సదుపాయాలు లేకున్నా
కరోనాతో పోరాడుతూ
దేశ రక్షణలో మేము సైతం అని నిలబడిన కర్షకులు!
కల్తీలోకంలో కుళ్ళుతున్న జీవులకు
సేవలందిస్తున్న మహాత్ములు పారిశుద్ధ్య కార్మికులు!
- జ్యోతి మువ్వల, 9008083344