Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ పేదరికాన్ని ట్రాఫిక్ సిగల్ల నడుముంచినా
మా బొచ్చుల సంపాదన దానం చేయదంటే చేయదు....!!
నువ్వు మాసిన బట్టలేస్కొని ఫ్లాట్ఫారం
మీద పన్నా...
మా మానవత్వం మా దేహం దాటి బయటకు రాదంటే రాదు....!
నువ్వు బస్టాండ్ మెట్ల మీద పల్లెం కొట్టుకుంట అడుక్కున్న....
నిన్ను తలెత్తి చూసే సంస్కారం మా సదువుకు లేదంటే లేదు....
నువ్వు ఆకలికి చచ్చి అనాధల రోడ్డు మీద పడ్డ..
నీ దగ్గరకచ్చి చూసి పాపమనే పుణ్యాత్ములం కాదంటే కాదు...!!
కానీ ఒకరోజు వస్తదేమో....
పేదవాళ్ల కన్నీళ్లు సముద్రంలా మారి మనందరి దాహం తీర్చే రోజు వస్తుందేమో....!!
వారి గుండెల్లో మండే మంటలే సూర్యుడిలా రేపు మనకు వెలుగు చూపుతుందేమో....
వారి బాధల్ని కుప్ప చేస్తే రేపు మనం కప్పుకునే దుప్పటి అవుతుందేమో...!
వారి ఖాళీ కడుపులే మనం రేపు తల దాచుకునే జాగలవుతాయేమో...!!
వాళ్లు పడ్డ అవమానాల పుట్ట తెల్లారితే మన పుస్తకాల్లో పాఠాలుగా చదవచ్చేమో...
పైసలు లేని వారి బతుకులే రేపు రూపాయికి పురుడు పోసే
చేతులవుతాయేమో...
పేదరికం ఒక నల్ల పల్కకైతే
అనుభవాల బలపాలు పట్టుకొని దిద్దితే...
మానని గాయాలను కన్నీళ్ళతో మల్పి రాస్తున్నప్పుడు....
గెలవలేక ఒడినప్పుడే మధ్యలో పుట్టినవాడు ధనవంతుడు.....
ఉన్నోడికి ''ఆధార్ కార్డ్'' అవసరం కంటే....
పేదోడికి ''ఆకలి కార్డ్'' అత్యవసరం....
- తుమ్మల కల్పన రెడ్డి, 9640462142