Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా కళ్లల్లో..
ఒక స్వప్నం కదలాడుతూ ఉంది
నేను దానిని చూడలేదు
అయినా అది అక్కడే
కదులుతూ ఉంది శతాబ్దాలుగా..!
నా ఉదరంలో..
ఒక ఆకలి గంట మోగుతూ ఉన్నది
నేను దానిని గ్రహించలేదు
అయినా అది అక్కడే
ధ్వనిస్తుంది శతాబ్దాలుగా..!
నా కాళ్లలో..
ఎంతో చెమట నీరు ఉంది
నేను దానిని చూడలేదు
అయినా అది అక్కడే
పారుతూ ఉంది శతాబ్దాలుగా..!
నా ఆత్మలో..
ఒక ఆశల నెచ్చెలి ఉంది
నేను దానిని గ్రహించలేదు
అయినా అది కూడా
ఆవిరై ఉంది శతాబ్దాలుగా...!
ఓ రోజు స్వప్నం చెదిరిపోయింది
ఓ పూట ఆకలి నశించిపోయింది
ఓ రాత్రి చెమటచుక్క ఆవిరై పోయింది
ఓ క్షణంలో ఆశలు నిరాశలై చెదిరిపోయాయి
అయినా...!
నేనిప్పుడు శతాబ్దాలుగా
రేపటి అశతో శిలనై మిగిలేవున్నా..!!
- డాక్టర్ పగిడిపల్లి సురేందర్
8074846063