Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరు నుండి పదవ తరగతి చదివే 76 మంది విద్యార్థుల సృజనాత్మక చిత్రలేఖన కళకు పుస్తక రూపమే ఈ ''జక్కాపూర్ జక్కనలు''. మనం కథలు, కవితలు, గేయాలు, పద్యాలు, వ్యాసాలు లాంటి పుస్తకాలు చూసాము కానీ బాలలు గీసిన 120 రంగుల చిత్రాలతో కూడిన పుస్తకం రూపొందించడం అరుదైన సందర్భమని చెప్పవచ్చు.
ఏడాదిన్నర వ్యవధిలో సమకాలీన సమస్యలకు విద్యార్థులు అద్భుతమైన రీతిలో చిత్రరూపమిచ్చారు. పర్యావరణ, ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక నేపథ్యంలో పిల్లలు బొమ్మలు వేసారు. ఈనాడు హారు బుజ్జీ -94, చెకుముకి -13, తెలంగాణ అల్లరి -9, బాల భారతం (నవంబర్ 2020) -1, నిత్య -2, గడుగ్గారు -1 ప్రత్రికల్లో ప్రచురితమైన బొమ్మలతో సిద్ధిపేట జిల్లా జక్కాపూర్రూ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య సంపాదకత్వంలో ఈ ''జక్కాపూర్ జక్కనలు'' అనే చిత్రలేఖన పుస్తకం రూపొందించబడింది.
ఇదే పాఠశాల విద్యార్థులు 2019లో రాసిన ''జక్కాపూర్ బడి పిల్లల కథలు'' అనే పుస్తకం బాల సాహిత్య చరిత్రలోనే నాలుగు నెలల్లోనే రెండవ ముద్రణ చేసుకుని అరుదైన పుస్తకంగా సంచలనం సష్టించిన విషయం లోకవిధితం. 2020లో 74 కవితలతో ''మధుర పద్మాలు'' అనే పుస్తకంతో చిన్నారులు అందరి మెప్పు పొందారు. ఇప్పుడు ఈ పుస్తకంతో అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు.
జక్కాపూర్ విద్యార్థులు కథలు రాయగలరు, కథలకు తగిన బొమ్మలు వేయగలరు. బొమ్మలకు తగిన కథలు రాసి పదిమంది మెప్పు పొందగలరు. చెకుముకి పత్రికలో ఆగస్టు, సెప్టెంబర్ 2022 సంచికల్లో కొంపల్లి విశిష్ట అనే అమ్మాయి బొమ్మకు తగిన కథలు రాసి ప్రశంసలు అందుకుంది. రంగినేని ట్రస్టు వారి కథల పుస్తకంలో ఈ పాఠశాల విద్యార్థులు 15 కథలకు తగిన బొమ్మలు వేసారు. ఇటీవలే నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు చెందిన షార్ వాణి పత్రిక నిర్వహించిన బొమ్మల పోటీలో కయ్యాల నిఖిత అనే విద్యార్థిని ఆరువందల రూపాయల బహుమతి గెలుచుకుంది..
ఇటువంటి విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీస్తున్న ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ప్రశంస నీయులు. వీరికి సహకరిస్తున్న ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయ బృందాన్ని తప్పకుండా అభినందించాలి. 52 రంగుల పేజీలతో చూడ ముచ్చటగా ఉన్నది. బడిలో విద్యా ర్థులు చదువుకే పరిమితం కాకుండా ఇక్కడి ఉపాధ్యాయులు పిల్లలను చిత్రకళలో ప్రోత్సహిం చిన విధానం పుస్తకంలో కనిపి స్తుంది. విద్యారులకు ఒక మధుర జ్ఞాపక దీపికలా అందించిన సంపాదకులు భైతి దుర్గయ్య వినూత్న ప్రయత్నం ఆదర్శ నీయం. అభినందనీయం. కావల సిన వారికి ఈ పుస్తకం పిడిఎఫ్లో ఉచితంగా పంపబడుతుంది. www.indiatoones.com లో ఈ పుస్తకంలోని చిత్రాలు అన్ని చూడవచ్చు.
- వేల్పుల రాజు, 9701933704