Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కథారచయిత మధురాంతకం నరేంద్ర రాసిన 'మనోధర్మ పరాగం' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దేవదాసీ వ్యవస్థ రద్దు కాలంలో ఆలయాలకు దూరం కావలసి వచ్చిన దేవదాసీల మానసిక స్థితికి ఈ నవల అద్దం పడుతుంది. గతం లో ఆటా బహుమతి అందుకున్న ఈ నవల మీద తెలుగు సాహిత్యంలో విస్తృతమైన చర్చే జరిగింది. ఐదు దశాబ్దాలకు పైగా కథా రచన చేస్తున్న నరేంద్ర ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం కుమారుడు. తండ్రీకొడుకులు ఇద్దరికీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించడం అరుదైన అంశం.
16 జూన్ 1957లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్యగారి పల్లెలో నరేంద్ర జన్మించారు. ఇంగ్లీషులో ఎంఏ చేసిన నరేంద్ర నయనతారసెహగల్ రచనలపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులుగా నరేంద్ర పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు 86 కథలు, నాలుగు నవలలు, ఏడు రేడియో నాటికలు, అనేక విమర్శనా వ్యాసాలు ప్రచురించారు. పలు కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. ఇంగ్లీషులో ఎంఏ చేసిన నరేంద్ర నయనతార సెహగల్ రచనలపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. నరేంద్ర సోదరుడు మహేంద్ర, సోదరి, తల్లి కూడా కథా రచయితలే.
కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత వారాల ఆనంద్‌కు అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రముఖ ఉర్దూ, పంజాబీ కవి గుల్జార్ రాసిన 'గ్రీన్ పోయెమ్స్' ను... పవన్ కే వర్మ ఆంగ్లాను వాదం చేయగా ఆనంద్ 'ఆకుపచ్చ కవితలు' పేరుతో తెలుగులోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ- 2022 అవార్డులకు సంబంధించి కవితలు, అనువాద విభాగాల్లో పురస్కారాలను గురు వారం కేంద్రం ప్రకటించింది. ట్రాన్స్లేషన్ విభాగంలో వారాల ఆనంద్ రాసిన ఆకుపచ్చ కవితలు పుస్తకానికి అవార్డు దక్కింది. గుల్జార్.. హిందీలో రాసిన గ్రీన్ పోయెమ్స్లో 58 కవితలు ప్రకృతికి సంబంధించినవే ఉన్నాయి. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా ఎంతో సూటిగా చెప్పారు. వేముల వాడలో పుట్టిన ఆనంద్, కరీంనగర్ లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కవితలు, కథలు రాసే ఆయనకు అనువాదాలు చేయడం అత్యంత ఇష్టం.
- దర్వాజ డెస్క్