Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పోరేట్ గద్ద
గాల్లో కాలర్ ఎగరేస్తుంటే
ఊరి పొలిమేర
పిల్లల కోడిలా మారిపోతుంది.
అయినా
రెక్కల కింద
కొన్ని పిల్లలు
లెక్క తప్పి పోతాయి.
పరిహార ప్రహసనం
పునరావృతం
అవుతూనే ఉంటుంది.
అనకొండలా మారిన
అవుటర్ రింగ్ రోడ్
గ్రామాల్ని మింగి
ముద్దలు ముద్దలుగా
విశాలమైన రహదారుల్ని
నగరం కోసం కక్కుతుంది.
అందులో ఎక్కడో
మింగుడు పడని
మా ఇంటి పెంకులు ఉండొచ్చు.
ఆ రహదారులపై
కాస్త జాగ్రత్తగా
ముందుకు సాగండి.
- కుడికాల వంశీధర్
9885201600