Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిగ్నల్ రంగు మారకుండానే
గేర్ తొక్కి గాలిలో తేలిపోతున్నారు
ఒక్క సెకండ్ లేటు కూడా
బయోమెట్రిక్ మెషిన్ భరించదు మరి
వర్షం విరుచుకు పడుతుంది
శవాలు కొట్టుకొస్తుంటాయి
గుర్తు పట్టేంత సమయం లేక
సామూహిక దహనం చేయడమే
ED ఇంటి ముందు వాలక ముందే
కండువాలు మారతాయి
వూసరవెల్లి ని మించిన రాజకీయాలు
క్యాంప్ పెట్టాయంటే
ప్రభుత్వానికి మూడినట్లీ
వేగం కొత్త వేదం
అతి నెమ్మది ప్రయోజనం శూన్యం
నీతి నియమాలు పూడ్చి వేసి
గెలుపు మాత్రమే
గోల్ పెట్టుకున్న విచిత్ర వైనం
మంచితో వెలగాలంటే
జీవిత కాలం నూనె పోస్తూనే
గుంపులో ఒక రాయి వేశావంటే
పత్రికలు టీవీలు వైరల్ చేస్తాయి
భయంకర దృశ్యాలు
సురభి నాటక పరదాల మల్లె
కనికట్టులా మారుతునే ఉంటారు
కొత్త బీభచ్చం వేగాంగా వచ్చి
పాతది చిన్నది అయిపోతుంది
వేగంగానే పతనం అవుతున్నాం
ఎదుగుతున్నా మనే ఇండెక్స్ లు చూపి
ప్రభుత్వం పతనాన్ని కప్పి పెట్టేసి
నలుగురికి కూడు పెట్టామని
కార్పొరేటు గర్వంగా కాలరెగరేసి......
- దాసరి మోహన్, 9885309080