Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలువలు ఆదర్శాలు బోధించాలని
గొప్ప గొప్ప కొటేషన్లు గుప్పించి
ఉపన్యాసం తయారు చేసుకున్నాను
మైక్ ముందు నిల్చుని మొదటి వాక్యం వినిపించగానే
'దిగిపో దిగిపో' అన్న అరుపులతో హాలు దద్దరిల్లింది
నా చేతిలోని కాగితాలను ఎవడో లాగేసుకున్నాడు
నాకు నేనే డూప్నని అనిపించసాగింది
అయినా ఆదర్శవ్యక్తి పాత్రలో జీవించటానికే ప్రయత్నించాను
కాని 'నటించు నటించు' అని ఒకటే లొల్లి
ఇటు హీరోను కాక, అటు విలన్‌ను కాక
జోకర్‌గా మిగిలిపోయాను
హాలులో ఉన్న నూరు మందికి నేనొక్కణ్ణే టార్గెట్
కుళ్ళిపోయిన టమాటాలతో నన్ను కొట్టసాగారు
దెబ్బతిన్న ఇగోతో స్టేజి దిగి
ఆ నూరు మందిలో కలిసిపోయాను
..............
ఇప్పుడు ఎవడో ఒక బక్రాగాడు వస్తాడు స్టేజి పైకి
కుళ్ళిపోయిన టమాటాలతో నేను కూడా సిద్ధంగా ఉన్నాను
- అమ్మంగి వేణుగోపాల్, 9441054637