Authorization
Sun April 20, 2025 06:17:06 am
స్నేహంలో చివరి మజిలీని చేరి
చివరిసారి ప్రేమలేఖ రాయాలి...
మనసుతో కాలక్షేపం చేయకుండా
ప్రేమ మీద చివరిసారి ఓ కాలమ్ రాయాలి...
నటించే ఈ లోకాన
నిజాయితీగా ప్రేమలో జీవించి చావాలి.
బాధను చూపకుండా
కన్నీళ్ళను రాల్చకుండ
నింగీ నేలా ఏకమైయ్యే విధంగా
మమతానురాగాలను వ్యాపింపజేయాలి..
లేదా...!!!
శ్మశానంలో లేచే కమురు కాకుండా
ప్రపంచం మరిచిపోలేని విధంగా
ప్రేమ స్వరూపమై
అందమైన ప్రేమకథకు చమురు కావాలి.
కదపకుండా బంధాన్ని కట్టిపడేసి
కలవకుండా పిలవకుండా కలహాలు లేకుండా
అవ్యక్త ఆత్మసంబంధ ఆరాధనై
ఓ అందమైన ప్రేమకు చివరి ప్రేమలేఖ రాయాలి.
- సయ్యద్ ముజాహిద్ అలీ,
7729929807