Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేతి తెరల విన్యాసంలో
రాతప్రతి తప్పిపోయే చూడు
పుట్టుక చావు
నాలుగు ముక్కల్లో మొక్కై
ఎదగక చచ్చిపోయే
పైసల గలగలలో
ఇన్లాండు కవర్లు మురిసిన దినాలు
క్యాలెండర్లో నిద్రించే
సెల్లొచ్చాక చేతి వాటం మారే
జీవిత లెక్కలన్ని
చార్జింగ్ చుట్టూ తిరిగితే
అకౌంట్ బ్యాలెన్స్ నిల్లే
బువ్వ దోరకని చోట
టెక్నాలజీ నాగుపోమై కాటేస్తది
ఆధునికత మైకంలో
ఎన్నిటినో
బొందబెట్టి ఎగురుతున్నం..
మట్టిలో కలిశేనాడు
నువ్వు విడిసినవన్ని
తోడొస్తరు
చివరికి మిగిలేది మన్నెరా కుంక
నువ్వు నువ్వుగా పుట్టేవరకు
ఎదురు చూడు!
అప్పటిదాకా సెలవు!
- పుష్యమి సాగర్