Authorization
Sat April 26, 2025 04:43:20 pm
మనసెంత మౌనంగున్నా
వయసు పరుగునాపేదెవరు
మనిషెంత గంభీరంగున్నా
తీరని ఆశలనాపేదెవరు
మార్గమేదో కనబడుతున్నా
కమ్మిన నిశిని వెలుగై తరిమేదెవరు
అక్కడక్కడ అడ్డంకులెదురై తరుముతుంటే
స్ఫూర్తినందిస్తూ ఆలంబనగా నిలిచేదెవరో
జీవన సమరంలో
స్వేదమెంతచిందించిన
విజయబావుటా శిఖరంపై రెపరెపలాడించేదెవరో
- సి. శేఖర్ (సియస్సార్)
9010480557