Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా మాటల్ని
నీకు దండెయ్యలేను
మనిషితనం కోల్పోయావు
నా అక్షరాల్ని
నీకు గంధపు బత్తుల్లా వెల్గించలేను
ద్వేష కంపుకొడ్తున్నావు
నా చూపుల్ని
నీకు అభిషేకించలేను
నిల్వ మురుగువైయ్యావు
ఈ నేల నా నీడ మాయమైనాసరే
అబద్దం బూడిదైయ్యే పిడుగులా
నిజం మాట్లాడాలె!
నిజమే మాట్లాడాలే!!
ఒంటిమీద
ఉన్మాదచమురు పోసి
నీ వంటించిన మంటలతో
కొన ఊపిరి ప్రజాస్వామ్యం
హాహాకారాలతో పరుగెడుతోంది
నీ అడుగడుగు
నెత్తుటి వాసనేస్తోంది
చుట్టూ భయాన్ని కాపలా పెట్టి
కాసేపు కత్తిలా
కాసేపు తుపాకిలా
ఇంకాసేపు విషకోరల గుంపులా
నీ నీడ స్క్రోలింగవుతోంది
అయినాసరే
నేనే గౌరీ లంకేశ్
- వడ్డెబోయిన శ్రీనివాస్, 885756071