Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నలుపు తెలుపు..!
రంగుల్ని దోచేదొకటి,పంచేదొకటి..!!
సౌందర్యం ఆనదు.!
వెలిగిపోయే వ్యక్తిత్వం ముందు..!!
గులాబి సొంతమౌతుంది..!
గుచ్చుకునే ముల్లునూ సహిస్తేనే..!!
తెలుపు మనసు ప్రధానం..!
రంగులదేం, ఉదయం
అరుణం, మరణం కష్ణం..!!
గడ్డిపోచే దర్భ,గుండెలా.. !
తడిపితే మెత్తన,కెలికితే కత్తిలా..!!
సంలీనమైన ప్రతిక్షణం .,
దేహత్యాగం..ఆత్మ యోగం..!!
విజయం మీ వెంటే...!
పలుకులు నొవ్వకుంటే,
నవ్వులు రువ్వుతుంటే..!!
''మనిషి'' ఆత్మహత్య దిశగా..!
పర్యావరణాన్ని పరిమారుస్తూ..!!
పదవే ప్రాథమ్యం,పరమార్థం..!
రాజకీయమే
హేయం.,గురివిందలా నిందలా..?!
బంధం గొప్పదే ఎప్పటికీ..!
అనురాగం పంచుతూ.,
నిత్య చైతన్యమై..!!
- గొల్లపల్లి రాంకిషన్(రాఖీ)