Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇగ ఏదో పేరు తిరగని మందులో
మంచు గడ్డల్ని వేసుకొని ఎంజారు
సేపు కడుపుగొట్టుకొని అమెరికా బ్రాండ్ లేబుల్‌తో
నిగనిగ
కొండల్నిపిండే రక్తపాతం సృష్టించని కంపెనీలకు
రెడ్ కార్పెట్ స్వాగతం
దాల్ సరస్సు ఇక అంబానీ విడిదికేంద్రం
ట్రంపోత్సవానికి లాల్ చౌక్ దగ్గర ఘనమైన ముస్తాబు,
మీ చైతన్యానికి పరీక్ష పెట్టే చైతన్యలు, నారాయణులు
బ్యాగులు సదురుకొని డండం ఎయిర్‌పోర్టులో ఎగరడానికి సిద్ధం
దేవదారు వృక్షం విదేశీ దారుతో ఊగే ఉయ్యాల
అమ్మా పార్వతి శివుడు జాగ్రత్త,
అమర్నాథ్ లింగానికి ఇంగ్లాండ్ ఇన్సూరెన్స్ వర్తింపు
లిలిలిలి షరతులు అసలే లేవు
భక్తులకు దర్శనం ఇజ్రాయిల్ చాపర్లలో,
స్వాంతన కూర్చే స్వాత్ లోయ ఆదాని ఆటబొమ్మ
ఒక్క సంతకంతో డెభ్బైవసంతాల స్వేచ్ఛని భూస్థాపితం
భూతల స్వర్గం కోసం కలల్ని త్యాగం చేయలేరా
యువకులు,
దట్టిచ్చిన తుపాకులు పేలవు,
పరిమళభరితమైన పూలతోటలో సీతాకోకలవ్వొచ్చు,
హక్కులపడవ వరదతాకిడికి పవిత్రగంగానదిలో
బొక్కబోర్లా,
అమితమైన ఆనందాల హరివిల్లుకు పోరాటాల తాళ్ళు చిక్కుకొని....
విచ్చుకున్న కాలమెకం నోట్లోకి తెల్లమబ్బుల ప్రపంచం,
మట్టికే పేరు మనిషికెందుకు,
శాలువాలో చుట్టిన దేహం ఖండ ఖండాలు
దేశం విస్తరిస్తున్న అఖండం.
- వేము