Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పున్నమినాటి వెన్నెలరాత్రి
నౌకా విహారంలాంటిది
మురిసిపోదామనుకుంటే
ఇక్కడ ఎప్పుడూ అమావాస్యనే!
చీకట్లో అగ్గిపుల్లగీస్తేనేమో
బట్టలంటుకుంటాయని
అందరూ బెదిరిపోతారు
నిర్లక్ష్యంతో నగరం తగలబడుతుంటే
తమదాకా రానిది, దిగులెందుకన్నట్టుగా
కళ్ళప్పగించి తమాషా చూస్తారు
రాత్రంతా వీధులు తిరుగుతూ
కుక్కలు మొరుగుతూనే వున్నాయి
మనుషులకన్నా అవే నయం
మౌనాన్ని భరించలేక
నిశ్శబ్దాన్ని తరిమికొడుతున్నాయి
మీరు తలుపులు తెరువకపోయినా
వీస్తున్నగాలి ఊరుకోదు
నిద్రలేచి చూడకపోయినా
పొడిచేపొద్దు ఆగిపోదు
లేవగానే అద్దంచూసుకుంటే
యుద్ధం జరిగిన గుర్తులు కనిపిస్తాయి
- ఆశారాజు,
9392302245