Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెజాన్ అటవీక్షేత్రాలు
భూగోళానికే ఊపిరితిత్తులు
పత్రం... హరితం నిర్ధాక్షిణ్యంగా
అగ్నికీలలకు ఆహుతైన వేళ
ఆకాశాన ఆక్రమించె పొగమబ్బులు
బతుకునిండా మసిపూతలు
ఉక్కిరిబిక్కిరి జీవజాతులు
గ్రీన్హౌస్ ఎఫెక్ట్ భయాందోళనలు
జీవ వైవిధ్యమంతా బుగ్గిపాలు
భూతాప ప్రకోప శాపాలు
సమతుల్యతకే తూట్లు... పోట్లు!
కార్చిచ్చు కారణాలు వెతికి
మంటలపై నీళ్ళు చల్లి
పర్యావరణ పరిరక్షణకు పట్టం కట్టి
ధరిత్రిపై హరిత దుప్పటి కప్పి
జీవకోటికి ఊపిరులూది
ధరణిపై ఆరోగ్య తోరణాలు కట్టి
భవితకు భద్రత.. భరోసానిచ్చి
గడపలకు సౌభాగ్య పారాణి పూసి
భూతలాన్ని హరితసీమగా మార్చి
సకలం సల్లగా... పచ్చగా వర్ధిల్లాలే!
(అమెజాన్ అడవులు అగ్నికి ఆహుతైన వేళ)
- డా||బుర్రా మధుసూదన్‌రెడ్డి,
9949700037