Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బయటకు వెళ్లేందుకు అడుగు పెట్టాను
నడకతోనే నా నీడానూ -
ఈసారి వింత నీడ
'ఇంతకీ ఎటూ నీ పయనం?' అడిగిందది!
అప్రతిభుడినవడం నా వంతయింది
నేనేమైనా కలవరపాటు చెందానా?
కచ్చితంగా లేదు!
నిజానికి నేనెక్కడికీ బయలుదేరలేదు
ప్రయాణమంటూ ఉంటే అది అంతర్ముఖంలోకే
ఇంకా లోలోతుల్లోకి....నేనెవర్ని అంటూ!
అంతలోనే అదే నీడ మరోసారి
తళుక్కున మెరిసింది నమ్రతగా నవ్వుతూ
'నిజం చెప్పు మిత్రమా! నీ ప్రయాణమంతా
సంతోషకరంగా సాగుతోందా?'
నేనన్నానూ-
'బ్రహ్మాండంగా సాగుతోంది.-
పెద్ద పెద్ద కోరికలూ లేవు
పిర్యాదులంతకన్నా లేవు-
వికసిస్తున్న ఓ బుల్లి లిల్లీ పువ్వులా
ఉల్లాసంగా ఉన్నాను-
రోజు రోజంతా పరిమళిస్తూ...
సంజవేళ సోలిపోతూ... !
విను !
ఇంతటి ఉల్లసిత వికాసాన్ని
నేను పొదువుకొన్న రోజు ఏదైనా
నేను సంతప్తి చెందే సాఫల్యదినమే!
మూలం : కవి -డా.బి.నరసింగరావు స్వేచ్చానువాదం : వర్చస్వి