Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాన ఇలా ఢల్లుగా
పడిందో లేదో అద్భుతం
ఇంద్రజాలం వరుణజాలం !
దారి పక్కన
దిబ్బల మీద
పెంటల మీద
పచ్చగ మొలకలే మొలకలు !
అసలు ఆకాశం నుండి రాలేవి
చినుకులా విత్తనాలా !
చిత్రాల చినుకులు
చిత్రంగా విత్తనాలు
వేలెడంతైనా లేని
వేడుక మొలకలు
చినుకూ విత్తనమే మరి !
అదిగో తలపై
చినుకులు రాలుతున్నాయి
చూసుకోవాలి ఎన్నెన్ని
మొలకలౌతాయో తడితడికి !
తల లోపల భావాలు
మొలకలే మరి మర్రి మర్రిగా
వెర్రి మాటల్లా ఉన్నాయా-
చినుకులు పడితే అంతే మరి !!
నానే వాళ్లు రండి -
రాని వారిని గుంజుక రండి
కోసుల నుండి పడుతున్న
చినుకుల్లో నానకపోతే ఎలా
ఉబ్బరం దిగదు మరి !
- కందాళై రాఘవాచార్య
8790593638