Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలా మంది ఆకలి తీర్చుకోడానికి ఏదో ఒకటి తింటుంటాం. అంతే తప్ప మనం తీసుకున్న ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యకరంగా ఉంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందా, మానసికంగా ఏమైనా మేలు చేస్తుందా లాంటివి బొత్తిగా ఆలోచించం. కొందరు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అందుకు తగ్గట్టు వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. కనుక ఆకలి తీరితే సరిపోతుంది అనుకోకుండా ఏమి తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా, ఎంత పరిమాణంలో తినాలో, వాటివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
ా అత్తిపండు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ చాలా మేలైనవి. వీటిల్లో ఏదో ఒకదాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్ 'ఎ', విటమిన్ 'సి' ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిని కడిగి నీళ్ళలో నానబెట్టండి. మర్నాడు ఉదయాన్నే ఆ నీళ్ళు తాగండి.. ఒకసారి ఓ రకం సరిపోతుంది. ప్రతిదీ టానిక్‌లా పనిచేస్తుంది.
ా బాదంలో పోషక విలువలు చాలా ఎక్కువ. కనుక రోజుకు ఐదు, ఆరు బాదం పప్పులు తినండి. విడిగానే కాదు, ఏ రూపంలో అయినా తినొచ్చు. బాదం పైపొరలో వగరు ఉన్నప్పటికీ అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. బాదంలో ఉండే కాపర్ పరిమాణం ఎనీమియాను పోగొడుతుంది. బాదంవల్ల ముఖానికి గ్లో వచ్చి సౌందర్యం ఇనుమడిస్తుంది.