Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి చెట్టుకు ఆరాటమెక్కువ
ఆకుల్లేవు తీగల్లేవు
పువ్వుల్లేవు కాయల్లేవు
వేళ్ళు కూడా అసలే లేవు
అయినా..
శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది
శాశ్వతంగా బతికేస్తుంది
పల్లె నుండి పట్నం దాకా
గల్లీ నుండి ఢిల్లీ దాకా
అన్ని వేళల్లో
అన్ని కాలాల్లో
అన్ని ప్రదేశాల్లో
ఎక్కడ చూసినా తానే కనబడుతుంది
ఎవ్వరినైనా ఇట్టే పడేస్తుంది
ఆకలిచెట్టుకు ఆశలెక్కువ
ఆశయాల కళ్ళను పొడిచేస్తుంది
ఆశల దీపాల్ని చిదిమేస్తుంది
మనసు అద్దాలను
ముక్కలు ముక్కలుగా చేస్తుంది
అంతస్తుల సువాసనల్ని
ఆనందంగా పీల్చేస్తుంది
ఆస్తి పర్వతాలను తన కడుపులో దాచేస్తుంది
ఆఫీసుల్లో విచ్చలవిడిగా వీరవిహారం చేస్తుంది
నేతల నాలుకలపై నాట్యం చేస్తుంది
చేతగాని దద్దమ్మల భుజాలపై ఎక్కి
మజా చేస్తుంది
ఊళ్ళకు ఊళ్ళే మింగేస్తుంది
పేదోడి కన్నీటి సెలయేళ్ళలో
తానమాడుతుంది
ఆకలి చెట్టుకు ఆవేశమెక్కువ
అమాయకుల బతుకుతోటలను
చిందరవందర చేస్తుంది
బతుకు భారంతో తమ బతుకుల్ని
కడతేర్చుకున్న వారితో
దోబూచులాడుతుంది.
అందలమెక్కాననీ
ఎవ్వరికీ అందననీ
అహంకారంతో విర్రవీగుతుంది
కానీ,
ఆకలిచెట్టుకు తెలియదు
ఏదో ఒకనాడు
ప్రకతి వికతంగా తాండవం చేస్తుందని
అందులో తాను బూడిదైపోతానని.
- తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939