Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా దేశం భగవద్గీత ..
కాదు కరోనా గీసిన రాత
నా దేశం అగ్నిపునీత సీత
కాదు అగ్ని పాదాల వలస యాత్ర
నా దేశం పావన గంగ
కాని కలుషితమైన రుధిర తరంగాల అంతరంగ
నా దేశం కాళిదాస కావ్య ఝరి
కాదు రోగ గ్రస్థ పురి
ఎవరో మైకును అదరగొట్టుతున్నారు?
పసివాళ్ళు జే కొడుతున్నారు?
బసవన్నలు తలలూపుతున్నారు ?
వాగ్దానాల హౌరు మధ్య మిద్యగా
భక్తుల భజన మిన్నంటుతుంటే
సామాన్యుల బతుకు చిద్రమౌతుంటే
అస్తవ్యస్థ ఆర్థిక చిత్ర విన్యాసానికి
ఆకలికేకలకాలవాలం
యముడి కరవాలం చివర
విషాదాల శవాల పూల హారం
(సి.నా.రె కి క్షమాపణలతో)
- కపిల రావమ్కుమార్, 9849535033