Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను నడుస్తున్నాను...
లోకమూ నడుస్తోంది.
వెన్నును ముద్దాడే డొక్కలు
మెతుకు వెతుకులాటలో నడుస్తున్నాయి.
నేను నడుస్తున్నాను...
సప్త నక్షత్రాల ఆకలిదప్పులు...
తైల దేహాలతో
చెమటను చెమ్మరిస్తూ
రోడ్డున పడ్డ జీవితాలపై
కన్నీరైనా కార్చకుండా నడుస్తున్నాయి.
నేను నడుస్తున్నాను ...
కన్నపేగుల్ని... ఆత్మీయుల శవాలను
భుజాలపై వేసుకొని
అమ్మతనము, మానవత్వమూ నడుస్తోంది
నేను నడుస్తున్నాను...
ఆకలి...
దరిద్రం...
హింస...
అహంకారం...
వివక్ష... ఎందుకూ...?
అనే బేతాళ ప్రశ్నలు కాలంతో పాటు నడుస్తున్నాయి. సమాధానం తెలిసిన మౌనం మాత్రం
ముక్కలు కాకముందే
నడవాలనుకుంది.
నేను నడుస్తున్నాను...
నడుస్తూ ఉంటాను.
- వహీద్ ఖాన్, 9441946909