హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి కారు ప్రమాదానికి గురైంది.మణికొండ కాలనీలోని పంచవటి కాలనీలో ఎదురుగా వస్తున్న కారును అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు కార్లు కొద్దిగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో మద్యం తాగలేదని తేలింది.
Mon Jan 19, 2015 06:51 pm