హైదరాబాద్ : అధ్యక్ష ఎన్నికల వేళ... ప్రస్తుత అధ్యక్షుడు, రానున్న ఎన్నికల్లో మరోమారు రిపబ్లికన్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన టోనాల్డ్ ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువడ్డాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఇరవై మూడేళ్ళ క్రితం... అంటే... 1997 లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా న్యూయార్క్ లోని వీఐపీ సూట్లో ఉన్న ట్రంప్.. తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ట్రంప్... తనను బలవంతంగా ముద్దుప్టెట్టుకోవడమే కాకుండా, గట్టిగా హత్తుకుని శరీరమంతా అసభ్యకరంగా తాకాడని డోరిస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పుడు తనకు 21 ఏళ్ళుంటాయని చెప్పారు. కాగా... అప్పుడు ట్రంప్ వయస్సు 51 ఏండ్లు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అంతేకాదు... డోరిస్ ఆరోపణలు... విపక్షాలకు ఆయుధంగా మారనున్నాయన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm