హైదరాబాద్ : పెళ్లి చేసుకోండిరా బాబూ.. పిల్లల్ని కనండిరా బాబూ అంటూ ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. మీరు పెళ్లి చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మంచి బహుమతులు కూడా ఇస్తామంటున్నా పెళ్లికాని ప్రసాదులు పెళ్లి చేసుకోవటానికి ముందుకు రావటంలేదు. దీంతో జపాన్ ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఎందుకంటే జపాన్ దేశంలో జనాభా తగ్గిపోతోంది. 2018నాటికి జపాన్ జనాభా కేవలం 12.65 కోట్లు మాత్రమే. దీంతో జపాన్ దేశానికి జనాభా కొరత వచ్చింది. దీన్ని ఇలాగే వదిలేస్తే రానున్న కాలంలో జననాల సంఖ్య మరింత సమస్యగా మారనుంది. దీంతో ప్రభుత్వం దేశంలోని యువత పెళ్లిళ్లపై ఫోకస్ పెట్టింది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండిరా బాబూ..అంటూ కోరుతున్న పరిస్థితి జపాన్ దేశంలో నెలకొంది.
పెళ్లిళ్లు చేసుకుంటే దేశంలో జనాభా పెరుగుతుందని భావించిన జపాన్ ప్రభుత్వం.. పెళ్లి చేసుకున్న జంటకు జపాన్ కరెన్సీ 600000 (ఇండియా కరెన్సీలో దాదాపు రూ.4,50,000) ప్రోత్సాహకంగా ప్రకటించింది. జపాన్ జనాభా సంఖ్య 12.68 కోట్లు మాత్రమే ఉండగా.. ప్రపంచంలో అత్యధికంగా వయో వృద్ధుల సంఖ్య కూడా ఆ దేశంలోనే ఉంది. అయితే ఆర్థిక సమస్యల వల్ల అక్కడి యువత పెళ్లికి నో చెబుతోంది. ఈ క్రమంలో వారికి ఆర్థిక చేయూతను అందిస్తూ యువత పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు కనడానికి ప్రోత్సహకాలను అందిస్తోంది. అయితే..పెళ్లి చేసుకునేవారి వయస్సు 40 సంవత్సరాలు మించకూడదని నిబంధన పెట్టింది. గత సంవత్సరం జపాన్‌లో కేవలం 8లక్షల 65 వేల మంది జన్మించగా..మరణాల సంఖ్య 13 లక్షల 77 వేల మంది. 100 సంవత్సరాలు వయస్సు దాటిన వారి సంఖ్య జపాన్ లోనే ఎక్కువ. ప్రపంచంలో కల్లా జపాన్ లోనే ఎక్కువగా 100 సంవత్సరాల వారు ఉంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 కల్లా జపాన్ జనాభాలో ఇప్పుడున్న వృద్ధుల సంఖ్య 35 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అలా చూసుకుంటే దేశంలో యువత కంటే వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో యువత పెళ్లిళ్లపై దేశ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జపాన్‌తో పాటు ఎస్తోనియా(యూరోప్), ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు కూడా యువత పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయి.
కాగా..జపాన్ వాసులు పనీ పనీ పనీ..అంటూ నిత్యం వర్క్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. వర్క్ కు అంతగా ఎడిట్ అయిపోయి పెళ్లికాని వారు పెళ్లిమీద ధ్యాస పెట్టటం లేదు.. పెళ్లి అయినవారు కూడా పిల్లల్ని కనాలనే ధ్యాసలో లేరు. దీంతో జపాన్ ప్రభుత్వం దేశంలోని యువత పెళ్లిళ్లపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు పెళ్లిళ్లు అయినవారికి ఆ దేశంలో పలు కంపెనీలు పిల్లల్ని కనటానికి సెలవులు..పైగా జీతంతో కూడిన సెలవులు కూడా ఇస్తున్నాయంటే జపాన్ దేశంలో జనాభా కొరత సమస్య ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. టెక్నాలజీలో జపాన్ ఎంతగా డెవలప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. జపాన్ బ్రాండ్ అంటే ఏ వస్తువుకైనా ఎంత డిమాండ్ ఉంటుందో కూడా చెప్పనక్కర్లేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 23,2020 01:33PM