హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే చిన్న చూపు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. తెలంగాణ మహిళా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీతక్క పాల్గొని మాట్లాడారు. 'మహిళల సమస్యల కోసం ఒక జేఏసీ ఏర్పాటు కావాలి. అన్ని పార్టీల మహిళా విభాగాల ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలుస్తాం. మహిళలను తొక్కేయడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటి రారు. తెలంగాణ మహిళా కమిషన్ కోసం బలమైన ఉద్యమం చేయాలి. బతుకమ్మ పేరు కవితమ్మకు మాత్రమే రావాలని కేసీఆర్ పరితపించారు. మహిళల జీవితాలను కేసీఆర్ బాగు చేస్తారన్న నమ్మకం నాకు లేదు. తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ తప్పులు మరుగున పడిపోతున్నాయి. నేను తెలుగుదేశం పార్టీలో ఎదిగిన మొక్కను. తెలుగుదేశం పార్టీ నా రాజకీయ పుట్టినిల్లు' అని చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm