టోంగా: ఫసిఫిక్ మహా సముద్రంలోని టోంగా సమీపంలో గురువారం భూకంపం సంభవించింది. గురువారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. లిఫుకా దీవులకు పశ్చిమాన పంగాయ్ గ్రామ సమీపంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. టోంగాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుడు జరుగుతుంటాయి.
Mon Jan 19, 2015 06:51 pm