హైదరాబాద్: రాష్ట్రంలో కందుల కొనుగోలుకు మార్గం సుగమమైంది. కేంద్రం విధించిన ఆంక్షల నేపథ్యంలో రైతులకు మేలు జరిగేలా త్వరలోనే కందులు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య సన్నాహాలు చేస్తోంది. 2020-21 ఖరీప్ సీజన్లో తొలిసారిగా నియంత్రిత పంట సాగు విధానంలో కంది సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 84 వేల 541 ఎకరాల విస్తీర్ణంలో కందిని సాగుచేశారు. పంట విస్తీర్ణం ఆధారంగా 8.20 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ దశలో కొనుగోళ్ల కోసం సిద్ధంగా ఉన్న టీఎస్ మార్క్ఫెడ్ సంస్థ 28 జిల్లాల్లో 130 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm