Mar 03,2021 12:17PM
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఓ 60 ఏళ్ల వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుళ్లపై దాడి చేశాడు. వారు నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికాడు. దీంతో భార్య, ఇద్దరు కూతుళ్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో కూతురిని స్థానికుల సాయంతో పోలీసులు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఆమె చావుబతుకుల్లో ఉంది. దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడికి మతి స్థిమితంగా లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Recomended For You