శివాజీనగర: భర్తను భార్య హత్య చేసిన ఘటన జే.జే.నగరలో తెల్లవారజామున చోటుచేసుకుంది. మోహన్ (41) భార్య పద్మ (37) బీబీఎంపీ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తుండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి మోహన్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో పిల్లలు లేరు. దంపతుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మత్తులో ఉన్న మోహన్ కిందపడిపోగా భార్య అతని మెడపై తొక్కింది. స్పృహ తప్పి పడిపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో సమీపంలో ఆసుపత్రిలో తీసుకెళ్తుండగా చనిపోయాడు. పరారైన పద్మను జేజే నగర పోలీసులు గాలించి అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm