హైదరాబాద్: తెలంగాణ మరో ఎన్నికలకు సిద్ధమైంది. మినీ పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు... జడ్చర్ల, అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm