కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బీహార్‌కు చెందిన ఇర్ఫాన్(20) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న పంచర్ షాప్‌లో పనిచేస్తున్న ఇర్ఫాన్, ముతూట్ ఫైనాన్స్ బిల్డింగ్‌లోని షెట్టర్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇర్ఫాన్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తోటి స్నేహితుడు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm