హైదరాబాద్: సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన సోమవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన గజ్వేల్లోని తన ఫాంహౌజ్లో హోం ఐసోలేషన్లో ఉంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం సీఎం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సీఎస్ ప్రకటనలో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm