హైదరాబాద్ : సూర్యాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 126 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని అన్నారు. అంతటి ధీరురాలి చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అద్వర్యంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm