కడప జిల్లా: రైల్వేకోడూరు పట్టణ పరిధిలోని నరసరామ్ పేటలో గుంజనేరు కాలువ పరివాహక ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఇల్లు కూలిపోవడం జరిగింది. ముందుగానే అప్రమత్తమై నివసిస్తున్న కుటుంబీకులు బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. pic.twitter.com/0yhnpNsjim
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 28, 2021
హైదరాబాద్ : ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి జిల్లాలోని రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని ముందే గమనించిన ఆ ఇంట్లోని వారు బయటికి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మధ్యాహ్నం ఆ ఇల్లు కుప్పకూలగా.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది.