హైదరాబాద్ : శృంగారంతో వ్యాధులు నయమవుతాయని మహిళా రోగులకు లోబర్చుకుంటున్న ఓ డాక్టర్ ఆకృత్యాలు ఇటలీలో వెలుగు చూశాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. ఇటలీలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న గియోవన్నీ.. ప్రెగ్నెన్సీ, గైనిక్ ఇతర సమస్యలతో తన దగ్గరకు వచ్చే మహిళలను లోబరుచుకునేవాడు. సెక్స్ ద్వారా వ్యాధులు నయమవుతాయని మహిళా రోగులకు మాయమాటలు చెప్పేవాడు. వారిని అసభ్యకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందేవాడు. అలా ఏకంగా 15 మందితో శృంగారం జరిపాడు.
ఈ క్రమంలోనే ఓ బాధిత మహిళ ఈ విషయాన్ని ఓ టీవీ విలేకరికి చెప్పింది. దాంతో ఆ విలేకరి ఆ వైద్యుడి రాసలీలలను బయటపెట్టేందుకు అతని వద్దకు కెమెరాతో వెళ్లింది. దాంతో వైద్యుడి రాసలీలలు బయటపడ్డాయి. బాధితులు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 07:04PM