Here Are The Official Theatre List Of #RRRTrailer
— NTR Trends 🌊 (@NTRFanTrends) December 7, 2021
All @tarak9999 Fans, @AlwaysRamCharan Fans & @RRRMovie
Lovers, Follow This Thread !#RRRMovie #RRRTrailerOnDec9th
Theatres List Of
Hyderabad City
Nizam
Krishna
Guntur pic.twitter.com/elryInYnrN
హైదరాబాద్ : ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్`. ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అయితే రాజమౌళి ప్రమోషన్స్ అంటే మాములుగా ఉండదు కదా. అందుకే ఈ ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. అయితే కొన్ని థియేటర్లలో మాత్రమే ట్రైలర్ విడుదల కానుంది. అందు కోసం తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొన్ని థియేటర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎంపిక చేసిన థియేటర్ల లిస్ట్ ఇదేనంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
థియేటర్లలో విడుదలైన అనంతరం ట్రైలర్ యూట్యూబ్లో అందుబాటులోకి రానుంది. ఈ ట్రైలర్ నిడివి రెండున్నర నిమిషాలు ఉంటుందని సమాచారం. ఈ ట్రైలర్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.