కోల్కతా : పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో ఓ సినిమా థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్క్ షో సినిమా హాలులో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున పొగలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm