Jan 19,2022 12:30PM
విజయవాడ: నగరంలో ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. పీఆర్సీ, హెచ్‌ఆర్ఏ అదనపు పెన్షన్, సీపీఎస్ రద్దుపై ప్రధానంగా చర్చించనున్నరు. ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల పట్ల ప్రజల్లో, ఉద్యోగుల్లో చులకన భావన ఏర్పడిందని సంఘ ప్రతినిధులు సమావేశంలో బండి శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన 62 ఏళ్ల వయసు వయోపరిమితిని పెంచడాన్ని వ్యతిరేకించాలని కార్యవర్గ సభ్యులు భావిస్తున్నారు.
Recomended For You