Jan 19,2022 03:24PM
హైదరాబాద్ : స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ప్రకటించింది. 2022 సీజన్ తర్వాత టెన్సీస్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఓటమి చెందిన అనంతరం ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'నా రికవరీకి ఎక్కువ సమయం పడుతుందని నేను భావిస్తున్నాను, నేను నా 3 ఏండ్ల కొడుకుతో కలిసి చాలా ప్రయాణం చేయడం ద్వారా అతన్ని ప్రమాదంలో పడేస్తున్నాను, అది నేను పరిగణనలోకి తీసుకోవాలి. నా శరీరం క్షీణిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. నేను తిరిగి రావడానికి, ఫిట్‌గా ఉండటానికి, బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డాను. తల్లులు వారి కలలను వీలైనంత వరకు అనుసరించడానికి మంచి ఉదాహరణగా నిలిచేందుకు ప్రయత్నించాను.' అని తెలిపింది.
Recomended For You