Jan 19,2022 03:32PM
హైదరాబాద్ : అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ నియోజకవర్గంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. 'ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి. శింగనమల ఎమ్మెల్యే గారు. ఎలెక్షన్ టైమ్ లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతిగారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సమస్యలను పక్కకి నెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలుపగలరు. ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు. శింగనమల నియోజకవర్గం' అని పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తమకు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పోస్టర్లు వేశామని చెప్పారు. ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recomended For You