లక్నో : ఉత్తర్ప్రదేశ్ లో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే అందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెనే సీఎం అభ్యర్థి అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.
తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ యూత్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అని ఓ విలేకరి ప్రశ్నించారు. అందుకు ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. ' ఇంకెవరైనా కన్పిస్తున్నారా? ఎక్కడ చూసినా నేనే కన్పిస్తున్నానుగా..! చూడట్లేదా?* అని అన్నారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 03:45PM