May 28,2022 02:55PM
హైదరాబాద్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి శనివారం సమావేశమయ్యారు. టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో తన భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వచ్చిన కైవల్యా రెడ్డి ఈ సందర్భంగా లోకేశ్ ను కలిశారు. త్వరలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ తరపున తనకు అవకాశం ఇవ్వాలని ఆమె లోకేశ్‌ను కోరినట్టు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే కూతురు ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకుడితో భేటీ కావడం చర్చనియాంశమైంది.
Recomended For You