सेवा, सुरक्षा और सहयोग
— Ministry of Railways (@RailMinIndia) June 23, 2022
A precious life was saved by the courageous act of help by on-duty staff, who jumped on tracks himself to save a person from getting gravely injured.
Indian Railways is proud to have daring & diligent staff like H. Satish Kumar and commends his bravery. pic.twitter.com/gcnHCrtXg4
హైదరాబాద్ : ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని పట్టాలపై పడుకున్నాడు. అయితే అది గమనించిన ఓ రైల్వే ఉద్యోగి అప్రమత్తమయ్యాడు. వెంటనే తన ప్రాణాలకు తెగించి అతన్ని కాపాడి హీరో అయ్యాడు. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడీ జరిగిందనే సమాచారం లేదు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ రైల్వేస్ తమ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
వీడియోలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాల మీద పడుకున్నాడు. దూరం నుంచి రైలు కూడా వస్తోంది. అయితే ఆ సమయంలో స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే సిబ్బంది ఒకరు అతనిని గమనించాడు. వెంటనే పరుగుత్తుకుంటూ వెళ్లి.. రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తిని ఎత్తుకుని పక్క ట్రాక్ మీదకు తీసుకెళ్లాడు. ఆ వెంటనే అతను పడుకున్న పట్టాలపై రైలు వేగంగా వెళ్లింది. ఈ ఘటన గురించి ఇతర వివరాలు తెలియరాలేదు. అయితే ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి పేరు సతీష్‌కుమార్ అని తెలిసింది. సతీష్కుమార్లాంటి ధైర్యవంతులు భారతీయ రైల్వేలో ఉన్నందుకు గర్వంగా ఉంది అంటూ ఇండియన్ రైల్వేస్ ట్వీట్లో పేర్కొంది. నెటిజన్లు కూడా అతన్ని అభినందిస్తున్నారు.