కొమురంభీం: జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. బెజ్జూరు జెడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీ సాయన్న, ముగ్గురు సర్పంచులు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు. రహదారులు, వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చెందారు. 12 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ప్రజాప్రతినిధులు రాజీనామా లేఖ రాశారు.
Mon Jan 19, 2015 06:51 pm